4 April, 2026 | 4:25 AM

బహుజనుల ఐక్యతతోనే నిజమైన మార్పు

04-04-2026 03:02 AM
  1. నయా జాగీర్దార్ల, దేశముఖ్‌ల పాలన అంతమొందించాలి 
  2. ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే పూర్ణచంద్రావు
  3. దొడ్డి కొమరయ్య, ఛత్రపతి శివాజీలకు నివాళులర్పించిన రిటైర్డ్ డీజీపీ

ఖైరతాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): దొడ్డి కొమరయ్య జయంతి, శివాజీ మహరా జ్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని మీడియా సెంటర్, డౌన్‌టౌన్ మాల్‌లో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ డీజీపీ, ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే పూర్ణచంద్రావు తదితరులు పాల్గొని వారికి నివాళుర్పించారు. ఈ సందర్భంగా కొమర య్య, శివాజీ మహరాజ్ సేవలను స్మరించుకున్నారు.

ఈ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య కురుమ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ రైతన్న పోరాట వీరుడిని అన్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గత 16 ఎన్నికల్లో 4 గురు ఎన్నికై తే రెడ్డి వెలమ కమ్మలు 576 మంది ఎన్నికయ్యారన్నారు. ఈనాటి 119 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో మూడు కులాలకు చెందిన ఎమ్మెల్యేలు 60 మంది ఉంటే కమ్మలు, వెలమల కన్న 5 రేట్లు ఉన్న కురుమలకు ఒక్కటే ఎమ్మె ల్యే ఉన్నారన్నారు.

ఇప్పుడు నడుస్తున్నది నయా జాగీర్దార్లు, నయా దేశ్‌ముఖ్‌ల పాలన అని అన్నారు.  దొడ్డి కొమురయ్య జాగీర్దార్ రామచంద్ర రెడ్డిని ఎదిరించాడు. అలానే సర్దా ర్ సర్వాయి పాపన్న రెడ్డి వెలమ జాగీర్దార్ల పీచమనిచాడు. శివాజీ మహారాజ్ మొఘులుల ను మట్టి కరిపించాడు అని కొనియాడారు.  వీరందరూ బీసీ బిడ్డలే బహుజన్ హీరోలే 

వారి స్ఫూర్తితో నయా జాగీర్దార్ల నయా దేశముఖ్‌ల పాలన అంతమొందించాలన్నారు. 1946 జూలై 4న కడవెండి గ్రామంలో జరిగిన నిరసనలో దేశ్ముఖ్ అనుచరులు కాల్పులు జరపడంతో కొమురయ్య అక్కడికక్కడే అమరుడ య్యాడు.  ఈ ఘటన తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికి, వేలాది గ్రామాల్లో ప్రజా ఉద్యమాన్ని విస్తరించిందన్నారు. ఆయ న త్యాగం సామాజిక న్యాయం కోసం జరిగిన చారిత్రక మలుపుగా మారింది.

రజాకార్ల ఆగడాల్ని ఎదుర్కొని తెలంగాణ స్వాతంత్య్రాన్ని సాధించింది.అదే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను కూడా సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొ న్నారు. శివాజీ ఒక మతపరమైన నాయకుడు కాదని, ప్రజల సంక్షేమాన్ని ప్రధానంగా భావించిన బహుజన చక్రవర్తి అని చెప్పారు.శివాజీ పాలనలో న్యాయం, పరిపాలనలో పారదర్శకత, ప్రజల రక్షణకు ప్రాధాన్యం ఇచ్చిన విధా నం నేటికీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.

దొడ్డి కొమురయ్య, శివాజీ మహారాజ్ వంటి బహుజన వీరుల చరిత్రలను సరిగా అర్థం చేసుకోవడం అత్యంత అవసరమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు చరిత్రను విమర్శనాత్మకంగా విశ్లేషించి తమ హక్కుల సాధనలో చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, న్యాయం, గౌరవం నెలకొల్పడానికి ఈ చారిత్రక పోరాటాల నుంచి ప్రేరణ పొందాల్సిన అవసరం ఉందన్నారు. బహుజన వర్గాల ఐక్యత ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంగెం సూర్యరావు, బీసీ అమెజాన్ అధ్యక్షులు, కిషోర్ కుమార్ పలువురు బీసీ నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.