25 April, 2026 | 2:06 AM

ట్రంప్.. భారత్ వచ్చి చూడండి

25-04-2026 12:21 AM

ఆయన వివాదాస్పద వ్యాఖ్యలకు ముంబై ఇరాన్ ఎంబసీ కౌంటర్

ముంబై, ఏప్రిల్ 24: ట్రంప్.. భారత్ వచ్చి చూడండి’ అంటూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ముంబై ఇరాన్ ఎంబసీ శుక్రవారం కౌంటర్ ఇచ్చింది. భారత్‌ను నరకంతో పోలుస్తూ అమెరికన్ రేడియో హోస్ట్ మైఖెల్ సావేజ్ షేర్ చేసిన లేఖను ట్రంప్ రీపోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ యన వ్యాఖ్యలను ముంబైలోని ఇరాన్ ఎం బసీ తిప్పి కొట్టింది. భారత్‌లోని అభివృద్ధి, సాంస్కృతిక విలువలు ట్రంప్‌నకు తెలిసేలా ఎవరైనా ఆయనను భారత పర్యటనకు తీసుకొస్తే బాగుండేది అంటూ పోస్ట్ చేసింది.

భారత్‌కు వచ్చి చూసి ఆ తర్వాత ఆ దేశం గురించి మాట్లాడాలని హితవు పలికింది. ఈ మేరకు మహారాష్ట్రలోని అత్యాధునిక సదుపాయాలు, సంప్రదాయ వేడుకలు, పర్యాట క ప్రదేశాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ట్రంప్ నరకకూపాల వ్యాఖ్యలకు ఇప్పటికే హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముంబైలోని ఇరాన్ ఎంబసీ సైతం భారత్‌కు మద్దతుగా నిలిచింది.