calender_icon.png 11 September, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ సన్నిహితుడు, చార్లీ కిర్క్ దారుణ హత్య

11-09-2025 11:17:54 AM

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌(Charlie Kirk shot dead) హత్యకు గురయ్యాడు. ఉటా కౌంటీలోని యూనివర్సిటీలో చార్లీ కిర్క్‌ను దుండుగులు కాల్చి చంపారు. మాస్ షూటింగ్స్ పై ఉటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో చర్చా కార్యక్రమానికి చార్లీ కిర్క్ హాజరయ్యారు. విద్యార్థి ప్రశ్నకు బదులిస్తున్న సమయంలో కిర్క్ పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చార్లీని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చార్లీ కిర్క్ మృతి చెందాడు. క్యాంపస్ పైకప్పు నుండి ఒకే బుల్లెట్ వచ్చిందని, నల్లటి దుస్తులు ధరించిన ఎవరో కాల్చారని, ఇది లక్ష్యంగా చేసుకున్న హత్యగా కనిపించిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. 

ఈ దాడికి పాల్పడిన నిందితుడిని ఎఫ్ బీఐ అదుపులోకి తీసుకుంది. చార్లీ కిర్క్(Charlie Kirk) మృతి పట్ల ప్రెసిడెంట్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి అని ట్రంప్(Donald Trump) ట్రూత్ పోస్టులో పేర్కొన్నారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండా అవనతం చేయాలని డొనాల్డ్ ట్రంప్ అధికారులను ఆదేశించారు. రాజకీయ హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. కిర్క్ సంప్రదాయవాద యువజన సంస్థ 'టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ' సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడు. యువ ఓటర్లలో ట్రంప్‌కు మద్దతు పెంచడంలో ఆయన సహాయపడ్డారు.  అమెరికాలోని అన్ని సైద్ధాంతిక వర్గాలలో రాజకీయ ప్రముఖులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కాల్పులు జరిగాయి.