27 April, 2026 | 4:03 AM

ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై ట్రంప్ వేటు?

27-04-2026 02:05 AM

నిధుల దుర్వినియోగం, విధుల్లో మద్యం తాగిన ఆరోపణలు

వాషింగ్టన్, ఏప్రిల్ 26: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంతరంగిక బృందంలో కలక లం మొదలైంది. గత కొద్ది నెలలుగా కీలక అధికారులు ఒకరి తర్వాత ఒకరు పదవుల నుంచి తప్పుకొంటున్నారు. తాజాగా ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పదవి కూడా ప్రమాదంలో పడినట్లు అక్కడి మీడియాలో విస్తృ తంగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఇప్పటికే అటార్నీ జనరల్ పామ్ బాండీ, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టినోయమ్ తమ బాధ్య తల నుంచి తప్పుకొన్నారు. ఇక రాబోయేది కాష్ పటేల్ వంతేన నే చర్చ నడుస్తున్నది.

కాలేజీ రోజుల్లో బహిరంగ ప్రదేశంలో మద్యం తాగడం, ఇతరు లతో అసభ్యంగా ప్రవర్తించడం కారణంగా పటేల్ రెండు సార్లు అరెస్టయ్యాడు. పటేల్ ఎప్పుడూ మద్యం తాగి ఉంటాడని, విధులకు కూడా సక్రమంగా హాజరు కాడనే ఆరోపణలున్నాయి. ఎఫ్బీఐ వనరులను వ్యక్తిగత పర్యటనల కోసం వాడుకున్నారనే విమర్శలున్నాయి. వింటర్ ఒలింపిక్స్ సమయంలో ఇటలీ పర్యటనకు ఎఫ్బీఐ విమానాన్ని వా డటమూ వివాదాస్పదమైంది. ఆరోపణలను పటేల్ ఖండిస్తున్నప్ప టికీ, ఆరోపణల నిగ్గు తేల్చాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వరుస వివాదాల నేపథ్యంలో ట్రంప్ ఆయనపై వేటు వేసే అవకాశం ఉం దని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పరిణామాలు ట్రంప్‌నకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది.