27 April, 2026 | 4:04 AM

గ్యాంగ్‌స్టర్ సలీం డోలా అరెస్ట్

27-04-2026 02:02 AM

సింథటిక్ డ్రగ్స్ తయారీ, రవాణా కేసుల్లో సూత్రధారి 

దొంగ పాస్‌పోర్ట్‌తో తుర్కియే పరారీ

తుర్కియే ఇంటెలిజెన్స్ ప్రత్యేక ఆపరేషన్‌తో చిక్కిన నిందితుడు

ఇస్తాంబుల్, ఏప్రిల్ ౨౬: ముంబై అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, ఛోటా షకీల్‌కు సన్నిహితుడైన సలీం డోలా ఎట్టకేలకు చిక్కాడు. సలీం తా జాగా తుర్కియే రాజధాని ఇస్తాంబుల్‌లో పట్టుబడ్డాడు.

ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా తుర్కియే ఇంటెలిజెన్స్ సంస్థ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి సలీంను అదుపులోకి తీసుకున్నారు. భారత్‌లో భారీ ఎత్తున సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి, వేర్వేరు ప్రాంతా లకు సరఫరా చేస్తున్న ముఠాకు సూత్రధారి సలీం అని పోలీసులు గుర్తించారు. సలీం నేర ప్రయాణం ముంబైలోని బైకుల్లాలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి మొదలైంది. యవ్వనంలో సలీం ముంబై, ఢిల్లీ నగరాల్లో గుట్కా విక్రయించేవాడు.

ఈ క్రమంలోనే అతడికి అండర్‌వరల్డ్ వ్యక్తులతో పరిచయా లు ఏర్పడ్డాయి. 2012లో 80 కిలోల గంజాయితో పట్టుబడిన సలీం ఐదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి బయట కు వచ్చిన తర్వాత కైలాష్ రాజ్‌పుత్ అనే డ్రగ్స్ స్మగ్లర్‌తో కలిసి సింథటిక్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు. 2018లో ముంబై పోలీసులు 100 కిలోల ఫెంటానిల్ డ్రగ్స్‌తో స లీంను అరెస్ట్ చేశారు. అయితే, ఫోరెన్సిక్ రిపోర్టులో సాంకేతిక కారణాల వల్ల నాలుగు నెలల్లోనే సలీం బెయిల్‌పై బ యటకు వచ్చాడు.

ఆ తర్వాత భారత్ నుంచి విదేశాలకు పరారయ్యాడు. డ్రగ్స్ ద్వారా సంపాదించిన డబ్బుతో తన కొడుకు తాహె ర్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ప్రారంభించాడు. చివరకు దొంగ పాస్‌పోర్ట్‌తో తుర్కి యే చేరుకున్నాడు. చివరకు అక్కడి పోలీసులకు చిక్కాడు. సలీం భారత్‌కు తీసుకువచ్చేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. తుర్కియేతో భారత్‌కు నేరగాళ్ల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో సలీం వద్ద ఉన్న ఏఈ పాస్‌పోర్ట్ ఆధారంగా దుబాయ్ మీదుగా అతడిని రప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.