15 March, 2026 | 5:17 PM

Breaking News

రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •   ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి   •   డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు   •   పారిశుధ్య కార్మికులే గ్రామ ప్రగతికి వెన్నెముక   •   అనుమతులు లేని ఇసుక టిప్పర్ పట్టివేత   •   రజాకార్లను తరిమికొట్టిన వీరుడు కామ్రేడ్ బీఎన్ రెడ్డి   •  

శాంసంగ్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్

25-05-2025 12:30 AM
  1. అన్ని మొబైల్ ఫోన్లకు టారిఫ్ నిబంధన వర్తింపు
  2. అమెరికాలో ప్లాంట్ నిర్మిస్తే ఎలాంటి టారిఫ్‌లు ఉండవు

వాషింగ్టన్, మే 24: ఐఫోన్ల ఉత్పత్తికి సంబంధించి టెక్ పరికరాల అగ్రగామి సంస్థ యాపిల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. అమెరికాలో ఐఫోన్లు తయారుచేయని పక్షంలో 25 శాతం సుంకాన్ని విధిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టారిఫ్ బాం బ్‌ను మరో దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌పైనా విసిరారు. శాంసంగ్ సహా అమెరికాలో విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్లకు టారిఫ్‌ల నిబంధన వర్తిస్తుందని వెల్లడించారు.

శనివారం వైట్‌హౌస్ వద్ద ట్రంప్ మీడియాతో మాట్లాడారు. యాపిల్ ఒక్కటే కాదు.. ఇంకా చాలా ఉన్నాయన్నారు. శాం సంగ్ అయినా మరే సంస్థ అయినా తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాలని హెచ్చరించారు.

ఇక్కడ ప్లాంట్ నిర్మిస్తే వారికి ఎలాంటి టారిఫ్‌లు ఉండవన్నారు. అలా కాకుండా ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసినవి తీసుకొస్తే మాత్రం అది న్యాయమైన ప్రక్రియ కాదు అని ట్రంప్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్.. అమెరికా మార్కెట్లో విక్రేతలో రెండో స్థానంలో ఉంది.  

ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఏటా 220 మిలియన్ ఫోన్లను విక్రయిస్తుండగా.. ఇందులో 60శాతం మొబైల్స్‌ను వియత్నాలంలో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడి నుంచే ఎక్కువగా అగ్రరాజ్యానికి ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు తాజా పరిణామాలతో అమెరికా మార్కెట్లలో యాపిల్ షేర్లు 2.6 శాతం వరకు కుంగిపోగా.. కంపెనీ సంపద 70 బిలియన్ డాలర్ల మేర ఆవిరైంది.