25-05-2025 12:31:20 AM
-8 రోజుల ముందే వచ్చిన రుతుపవనాలు
-రెండు, మూడు రోజుల్లో తెలుగురాష్ట్రాల్లోకి..
-జూన్ రెండోవారం నుంచి విస్తారంగా వానలు
న్యూఢిల్లీ, మే 24: నైరుతి రుతుపవనాలు ముందే పలకరించాయి. దేశానికి అత్యధిక వర్షపాతం అందించే నైరుతి రు తుపవనాలు శనివారం కేరళను తాకాయి. 2009 తర్వాత రుతుపవనాలు ఇంత ముం దుగా కేరళలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి.
సాధారణంగా జూన్ 1 ప్రారంభమ య్యే రుతుపవనాలు 8 రోజుల ముందే దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. మరో రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
2009లో మే 23న నైరుతి రుతుపవనాలు జూన్ 1 కన్నా ముందే కేరళను తాకాయి. గతేడాది మే 30న రాగా.. 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి దేశంలోకి ప్రవే శించింది. 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకాయి.
రుతుపవనాల వ్యవస్థ చురుగ్గా ఉండ టం, అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా కేరళలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో తూ ర్పు వైపు కదులుతోంది. రత్నగిరి, దపోలి మధ్య దక్షిణ కొంకణ్‌తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అం చనా వేస్తోంది.
దీని ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కేరళలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కన్నూర్, కాసరగోడ్, మలప్పురం, కోజికో డ్, వయనాడ్, కన్నూర్, త్రిస్సూర్ జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ అయిన వాటిలో ఉన్నాయి.