25-05-2025 12:28:23 AM
మృతుల్లో మావోయిస్టు అగ్రనాయకుడు పప్పు లోహ్ర, అతడి సహాయకుడు ప్రభాత్
రాంచీ, మే 24 : జార్ఖండ్ రాష్ట్రంలో భద్ర తా బలగాలు, మావోయిస్టులకు శనివారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. జార్ఖండ్ జనముక్తి పరిషత్(జేజేఎంపీ) అధినేత పప్పులోహ్ర, అతడి సహాయకుడు ప్రభాత్ గుంజును భద్రతా బలగాలు కాల్చిచంపాయి. జేజేఎంపీ అనేది సీపీఐ మావో యిస్టుల నిషేధిత చీలిక సంస్థ.
ఈసందర్భం గా లతేహార్ ఎస్పీ కుమార్ గౌరవ్ మాట్లాడుతూ.. లోహ్రపై రూ.10లక్షల రివార్డు, గుంజుపై రూ.5లక్షల రివార్డు ఉందని చెప్పా రు. ఎదురుకాల్పుల్లో వారిద్దరూ మరణించారని పేర్కొన్నారు. జేజేఎంపీకి చెందిన మరో మావోయిస్టుకు గాయాలయ్యాయని, అతడి నుంచి ఒక రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.
అలాగే ఒక పోలీసుకు సైతం గాయాలు కాగా రాంచీలోని ఉన్నత వైద్యకేంద్రంలో చికిత్స అందిస్తున్నామని, అతడి పరి స్థితి నిలకడగా ఉందని వివరించారు. పప్పు నేతృత్వంలోని జేజేఎంపీ బిల్డర్లు, కాంట్రాక్టర్లపై దాడి కోసం ఇచ్చాబార్‌లో సమావేశ మైనప్పుడు భద్రతా దళాలు వారిపై దాడి చేశాయి. పప్పును లొంగిపోవాలని కోరినప్పటికీ అతడు పోరాడుతూ చనిపోవడానికి ఇష్టపడ్డాడని అధికార వర్గాలు తెలిపాయి. లోహ్రపై దాదాపు 36 దాక క్రిమినల్ కేసు లు ఉండగా, గంగుపై 18 క్రిమినల్ కేసులు ఉన్నాయి.