5 May, 2026 | 1:46 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

పోషక ఆహారంతో క్షయ వ్యాధి దరిచేరదు

25-03-2025 12:35 AM

ఆర్. ఎం.ఓ సుధాకర్ రావు 

హుజురాబాద్, మార్చి24 (విజయ క్రాంతి): పోషక ఆహారంతో క్షయ వ్యాధి దరిచేరదని హుజురాబాద్ ఆర్. ఏం వొ సుధాకర్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో సోమవారం వరల్ టీవీడేని పురస్కరించుకొని డివై డిఎంహెచ్వో, ఏరియా హాస్పిటల్ హుజురా బాద్, చిల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో  ప్రధాన వీధులలో టీబి అవగా హన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఆర్‌ఎంవో సుధాకర్ రావు మాట్లాడుతూ.. క్షయ వ్యాధి గురించి రోగులు భయపడాల్సిన అవసరం లేదని, డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా కోర్సు వాడితే నయం అవుతుందని రోగులకు సూచించారు. క్షయ రోగుల కోసం ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచిత పరీక్ష,మందులు, పోషక ఆహార నిమిత్తం నెలకు 1000 అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుకర్, మెడికల్ ఆఫీసర్ జరీనా, ఎంఎల్ హెచ్పి బంజారా ప్రతాప్, విజేందర్ రెడ్డి, సమ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, దేవదర్, సుజాతతో పాటు పాల్గొన్నారు.