15-02-2026 12:13:55 AM
24 గంటలు గడవక ముందే సీఎంను కలిసిన ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు
అభివృద్ధి కోసమే కలిశామని వెల్లడి
అలంపూర్, ఫిబ్రవరి 14: గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ హస్తగతం అయినట్లు తెలుస్తోంది. మరోపక్క అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తూ సోషల్‌మీడియాలో వైరల్ చేయిస్తున్నారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరఫున 10 వార్డుల్లో అభ్యర్థులు బరిలో నిలిచి, ఒక్క వా ర్డు మినహా మిగతా 9 వార్డుల్లో ఓటమి పాలయ్యారు. అక్కడ 8 వార్డుల్లో ఆల్ ఇండి యా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున గెలిచి, ప్రభంజనం సృష్టించిన కౌన్సిలర్లు 24 గంట లు గడవకముందే శనివారం రాత్రి హైదారాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, మాజీ ఎమ్మె ల్యే సంపత్ కుమార్ సమక్షంలో కలిశారు.
దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా ఫా ర్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు చేరినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వార్తలపై ఫార్వార్డ్ బ్లాక్‌కౌన్సిలర్లు స్పందించారు. సీఎంను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాము పార్టీ మారట్లేద ని, కేవలం తమ మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి కా ర్యక్రమాలకు ప్రభుత్వం నుంచి సహకారం కోరడానికే సీఎంను కలిసినట్టు స్పష్టం చేశారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని, నిధుల విషయంలో సానుకూలంగా స్పందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డడి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా చైర్మన్, వైస్‌చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కాలేదని అప్పుడే అభివృద్ధి కోసం సీఎంను కలిశారా? ప్రజలకు సేవ చేయడానికి వెళ్లారా? లేక తమ అభివృద్ధి కోసం కలిశారా, బేరాల కోసం వెళ్లారా? ఓటేసి గెలిప్తే ఇట్ల చేస్తారా? అంటూ వడ్డేపల్లిలో ప్రజలు బహిరంగానే చర్చించుకుంటున్నారు.