15-02-2026 12:11:16 AM
నేతల మధ్య కొరవడిన సమన్వయం
కరీంనగర్‌లో పట్టు కోల్పోయిన కాంగ్రెస్
నిరాశ చెందుతున్న పార్టీ కార్యకర్తలు
కరీంనగర్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉ న్నాయి. రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పట్టు సాధించలేకపోయింది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరి సిల్లతో సహా కరీంనగర్ మినహా అన్నింటిలో కాంగ్రెస్ సత్తాచాటడమే కాదు ఒక కార్పొరేషన్, 10 మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోనుంది.
రాజకీయ చైతన్యం గల కరీంనగర్‌లో మాత్రం కాషా యం రెపరెపలాడింది. దీనికి కారణం అధికార కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరే ప్రధాన కారణమని చెప్పవచ్చు. కాంగ్రెస్‌లో ఎవరికివారే నేనే రాజు నేనే మంత్రిగా వ్యవహరిం చడం, బీఆర్‌ఎస్ బలహీనపడడంతో కలిసివచ్చిన అవకాశాన్ని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ అందిపుచ్చుకుని కరీంనగర్‌లో మొదటి సారిగా కాషాయ జెండా రెపరెపలాడించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన 2014 నుంచి ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో కాం గ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యంగా కరీంనగర్ నగరంలో పుంజుకోలేకపోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న అనంతరం కరీంనగర్‌పై పట్టు సాధించుకునే ప్రయత్నం పార్టీ చేసినా ఫలితం దక్క లేదు. కరీంనగర్ పార్లమెంట్ నుంచి కాం గ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు ఎన్నికల అనంతరం ఇక్కడే ఉం టూ పార్టీలో తనదే నడవాలనే ఆరాటంతో ముందడుగు వేస్తూ వచ్చారు.తొలుత కరీంనగర్ అర్బన్ అధ్యక్ష పదవిని ఆశించారు.
అధ్యక్ష పదవి ఆంజన్ కుమార్‌కు దక్కడంతో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని ఆశించి సాధించుకోగలిగారు. ఇక్కడ పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో నిలబడ్డ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి కోసం ప్రయత్నించినా రాజేందర్‌రావుకే దక్కింది. రాజేందర్‌రావు అందరినీ కలుపుకోలేకపోతున్నారన్న అపవాదు ఉంది.
అర్బన్‌బ్యాంకు ఎన్నికల సమయంలో పార్టీకి రహితంగా జరిగే ఎన్నికల్లో తను ఒక ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసి పోటీలో దించడం, ప్రస్తుతం గెలుపొంది పాలకవర్గంలో ఉన్నవారికి నచ్చలేదు. ఈ మేరకు ఫిర్యాదులూ చేశారు. ఈ అర్బన్ బ్యాంకుఎన్నిక మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, రాజేందర్రావుకు మధ్య గ్యాప్ పెంచిం ది. నియోజకవర్గ ఇన్‌చార్జి నియమితులైన అనంతరమైనా మార్పు వస్తుందని నేత లు ఆశించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో అన్ని తానై నడిపించినప్పటికీ ఫలితం దక్కలేదు. 14 స్థానాలు దాటకపోవడంతో కాం గ్రెస్ శ్రేణులు మరోమారు ఆయనపై గుర్రుమంటున్నాయి.
మంత్రి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు లు ప్రచారం నిర్వహించిన సందర్భంలో కూడా స్థానిక నేతల మధ్యనున్న సమన్వయలోపం కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికలకు మూడు రోజుల ముందు జూమ్ మీటింగ్ నిర్వహించి ఇక్కడి పరిస్థితిపై క్లాస్ ఇచ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇక ఇక్కడి ఆధిపత్య పోరు, సమన్వ య లోపం వల్ల కరీంనగర్‌లో హస్తంకు పూర్వవైభవం కష్టమేననంటున్నారు పార్టీ కార్యకర్తలు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలు ఇక్కడ పట్టు కోసం ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.