27 July, 2026 | 1:16 PM

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

30-05-2024 02:04 AM

రంగారెడ్డి, మే 29 (విజయక్రాంతి) : కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలంలోని ఆమనగల్లు షాద్‌నగర్ ప్రధాన రహదారిపై గల దేవకి పంక్షన్‌హాల్ సమీపంలో రెండు బైక్‌లు ఢీకొని ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్కస్ తండాకు చెందిన సభావట్ కృష్ణ తన వ్యవసాయ పొలంలో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. కోళ్ల వ్యాక్సిన్ కోసం కేశంపేట్ మండలానికి వెళ్లి పనులు ముగించుకొని తండాకు వస్తున్నాడు. మహా రాష్ట్రకు చెందిన ఇద్దరు యువకులు తలకొండపల్లికి బైక్‌పై వెళ్తున్నారు.

దీంతో రెండు బైక్ లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్రగాయాలవ్వడంతో మృతి చెందాడు. మరో బైక్‌పై వెళ్తున్న రంజిత్‌చౌహన్‌కు కాలు విరిగి తీవ్రగాయా లు కాగా, మరో యువకుడు పరారయ్యాడు. మృతిడు కృష్ణకు భార్య మనీ, ఇద్దరూ కుమారులు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని కృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి దవాఖానకు తరలించారు. రోడ్డు ప్రమాద సమయంలో అదే రూట్‌లో హైద్రాబాద్‌కు వెళ్తున్న మాజీ ఎంపీ మల్లు రవి యాక్సిడెంట్‌ను చూసి తన వాహనాన్ని ఆపారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి రోడ్డు ప్రమాద తీరు తెన్నుల పై ఆరా తీసారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రున్ని స్థానిక దవాఖానకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.