27 July, 2026 | 1:59 PM

ఘనంగా నరసింహ స్వామి నిత్యకల్యాణం

30-05-2024 02:04 AM

యాదాద్రి భువనగిరి, మే 29 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బుధవారం స్వామివారి నిత్య పూజా కైంకర్యాలు సంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారికి బిందె తీర్థం, సుప్రభాత సేవతో ప్రారంభమైన నిత్యపూజలు రాత్రి పవళింపు సేవతో పరిసమాప్తమయ్యాయి. అర్చకులు ఉత్సవ మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. బుధవారం స్వామివారికి భక్తుల నుంచి రూ. 36,35,451 ఆదాయం సమకూరింది.