విహార యాత్రలో విషాదం
ఇద్దరు మృతి, ఇద్దరు గల్లంతు
మేడ్చల్, మే 29: విహార యాత్రకు వెళ్లిన నలుగురు వాగులో గల్లంతవ్వగా, ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం బాపట్ల పోలీసులు గాలిస్తున్నారు. వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టకు చెందిన సునిల్ కుమార్ (35), అతని కుమారుడు అనూప్ రాజ్ (13)లు ఈసీఐఎల్‌కు చెందిన కిరణ్‌కుమార్(30), బండ నందు(30)లు మరో 28 మంది బంధువులతో కలిసి రెండ్రోజుల క్రితం శుభకార్యానికి వెళ్లారు. తిరుగు ప్ర యాణంలో బాపట్లలోని నల్లమడ వాగులో అనూప్ స్నానానికి దిగి కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో తండ్రి సునీల్ కూడా కొట్టుకుపోయాడు. వారిని కాపాడబోయి మరో ఇద్దరు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న బాపట్ల పోలీసులు.. స్థానిక గజ ఈతగాళ్ల సహాయంతో సునిల్‌కుమార్, అనూప్ రాజ్‌ల మృతదేహాలను వెలికితీశారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని తెలిపారు.






