11 March, 2026 | 5:04 PM

ప్రాణం తీసిన చేపల వేట.. కృష్ణా నదిలో గల్లంతైన అన్నదమ్ములు

11-03-2026 03:36 PM

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం(Chintalapalem Mandal) చింత్రియాల వద్ద బుధవారం కృష్ణా నదిలో(Krishna River) ఇద్దరు బాలురు గల్లంతయ్యారు. మృతులు చింత్రియాలకు చెందిన సమీర్(15), సద్దాం(13)లు. చేపల వేట కోసం వారు కృష్ణా నదికి కొరాకిల్‌పై వెళ్లారు. సాంప్రదాయ కొరాకిల్(Coracle) బోల్తా పడటంతో వారు నీటిలో పడిపోయారు.

సమాచారం అందుకున్న చింతలపాలెం పోలీసులు(Chinthalapalem Police) సంఘటన స్థలానికి చేరుకుని నిపుణులైన ఈతగాళ్ల సహాయంతో నది నుండి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైనవారు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములుగా గుర్తించారు. పల్నాడు జిల్లాలోని ఓ ఉర్దూ మీడియాం స్కూల్(Urdu Medium School) ఇద్దరు చదువుతున్నారు. రంజాన్ సెలవులకు ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. యువకులు మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న  పోలీసులు యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.