విమానంలో 133 మంది ప్రయాణికులు.. ఎయిరిండియాకు తప్పిన ముప్పు
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం.. రన్ వే మూసివేత
ఫుకెట్ ఎయిర్ పోర్టులో రన్ వేను తాకిన విమానం
ముంబై: హైదరాబాద్-ఫుకెట్ (థాయిలాండ్) విమానాన్ని నడుపుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం(Air India Express plane) ఫుకెట్ విమానాశ్రయంలో చక్రం ఊడిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానానాకి థాయ్ లాండ్ లో ప్రమాదం తప్పిందని అధికారులు ప్రకటించారు. ఫుకెట్ ఎయిర్ పోర్టులో(Phuket International Airport) దిగుతుండగా విమానం బలంగా రన్ వేను తాకింది. బలంగా రన్ వేను తాకడంతో ముందుభాగం ల్యాండింగ్ గేర్ దెబ్బతింది.
టైర్ ఊడిపోవడంతో ఎయిర్ ఇండియా విమానం(Air India Express) రన్ వేను రాసుకుంటూ వెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నారని, ప్రస్తుతం ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వివరించారు. దెబ్బతిన్న రన్ వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. విమాన ప్రమాదంతో ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యాహ్నం 12.08 నుండి సాయంత్రం 6 గంటల వరకు రన్‌వేను తాత్కాలికంగా మూసివేస్తూ ఎయిర్‌మెన్ (NOTAM) కు నోటీసు జారీ చేసింది. దీంతో ల్యాండ్ కావాల్సిన అన్ని విమానాలను సమీపంలోని గగనతలంలో నిలుపుకోవాల్సి వచ్చింది, కొన్నింటిని ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు మళ్లించారు.




