07-06-2025 08:26:08 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో, మండలంలోని గ్రామాల్లో శనివారం బక్రీద్(Eid al-Adha) పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముస్లిం సోదరులు మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకొని అలింగనం చేసుకున్నారు. మండలంలోని దేమి కలాన్, తాడ్వాయి, ఎర్ర పహాడ్, సంతయిపేట, కృష్ణాజివాడి, బ్రాహ్మణపల్లి, చందాపూర్ గ్రామాల్లో వేడుకలు నిర్వహించారు.