29 June, 2026 | 2:01 AM

నిండు జీవితానికి రెండు చుక్కలు

29-06-2026 12:00 AM
  1. 84,301 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ లక్ష్యం
  2. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్ 

హనుమకొండ, జూన్ 28(విజయ క్రాంతి): పోలియో రహిత సమాజ నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జననం నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించా లని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నా యిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్  చాహాత్ బాజ్ పాయి పిలుపుని చ్చారు.జాతీయ పల్స్ పోలియో కార్యక్రమా న్ని ఆదివారం హనుమకొండ ప్రభుత్వ ప్ర సూతి ఆసుపత్రి (మిషన్ ఆసుపత్రి)లో వా రు సంయుక్తంగా ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ‘నిండు ప్రాణానికి రెండు చుక్కలు‘ అనే నినాదంతో జూన్ 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్న పల్స్ పోలి యో కార్యక్రమాన్ని ప్రజలంతా విజయ వంతం చేయాలని కోరారు. చిన్నారులను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి మాట్లాడుతూ జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల 84,301 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ అందించేందుకు సమగ్ర కార్యాచర ణ రూపొందించినట్లు తెలిపారు.