29 June, 2026 | 2:03 AM

పద్మశాలీలు రాజకీయంగా చైతన్యం కావాలి

29-06-2026 12:00 AM

కరీంనగర్ క్రైమ్, జూన్ 28 (విజయక్రాంతి): పద్మశాలీలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం పిలుపునిచ్చారు. ఇటీవల ఎన్నికైన గోపాల్‌రావు పేట పద్మశాలి సేవా సంఘం,యువజన సంఘం నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం జరిగింది. నూతనంగా ఎన్నికైన పద్మశాలి సేవా సంఘం కార్యవర్గం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం ఆధ్వర్యంలో, పద్మశాలి యువజన సంఘం కార్యవర్గం జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మహేషుని మల్లేశం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు.

కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేటర్లు  వాసాల రమేష్,  వేముల శేఖర్, జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వోల్లాల కృష్ణ హరి, జిల్లా పద్మశాలి యువజన సంఘం ప్రధాన కార్యదర్శి మహేష్‌ని మల్లేశం నాయకులు అల్సభద్రయ్య స్వర్గం లక్ష్మీనారాయణ, పెంటి శ్రీకాంత్, రాజు, పద్మశాలి సేవ సంఘం అధ్యక్షులుగా కొలిపాక మల్లయ్య ఉపాధ్యక్షులుగా కొలిపాక మల్లేశం ప్రధాన కార్యదర్శిగా కొలిపాక కమలాకర్ కార్యనిర్వహక కార్యదర్శిగా రాంపల్లి శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా మచ్చ గంగయ్య కోశాధికారిగా సిరిపురం మల్లేశం కార్యవర్గ సభ్యులుగా నల్ల శ్రీనివాస్ కొలిపాక నాగరాజ్ కొలిపాక లక్ష్మణ్ అలువాల శంకర్ గోనె రాజు, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు అలువాల విష్ణు, ఉపాధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి రుద్ర నాగరాజ్ కార్యనిర్వహక కార్యదర్శి మామిడాల నాగరాజ్ సంయుక్త కార్యదర్శి అలువాల గంగాధర్  కోశాధికారిగా కొలిపాక ప్రవీణ్ కార్యవర్గ సభ్యులు  కొలిపాక కమలాకర్ ఎలిగేటి మహేష్ గోనె రమేష్ ఎలిగేటి మహేష్ ఏన్నం రామాంజనేయులు, సిరిపురం  గంగరాజు పద్మశాలి సంఘం  సలహాదారులు అలువాల సత్యనారాయణ, పద్మశాలి సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.