ఇద్దరు భారతీయులు మృతి
- ఒకరు గల్లంతు
హోర్ముజు జలసంధిలో ఘటన
న్యూఢిల్లీ, మార్చి 11 : పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యం లో బుధవారం హోర్ముజ్ జలసంధి లోని వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో ఇద్దరు భారతీయులు మృతిచెందారు. ఒకరు గల్లంతయ్యారు. ఈ మేరకు మృతుల జాబితాను భారత ప్రభుత్వం విడుదల చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ,
యూఎస్ ఇజ్రాయెల్, ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న వా ణిజ్య నౌకల్లో దాడులు జరిగినప్పుడు భారతీయులు ప్రాణాలు కోల్పో యారని తెలిపారు. ఒకరు కన్పించకుండా పోయాడు. గల్ఫ్ ప్రాంతం లో గాయపడిన అనేక మంది భారతీయులకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు కూడా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ధృవీకరించింది. ఈ దాడులు హోర్ముజ్ జలసంధి సముద్ర మార్గంలో జరిగినట్టు భారత ప్రభుత్వం తెలిపింది.




