11 August, 2026 | 1:51 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

20-06-2025 12:05 PM

కాంకేర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శుక్రవారం ఉదయం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో(Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్ (District Reserve Guard), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force) సంయుక్త బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరినప్పుడు చోటేబెథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ కొండపై కాల్పులు జరిగాయని కాంకేర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇందిరా కళ్యాణ్ ఎలెసెలా మీడియాకి తెలిపారు. కోత్రి నదికి అవతలి వైపు నిషేధిత మావోయిస్టు సంస్థ సభ్యులు ఉన్నారనే సమాచారం ఆధారంగా అమతోలా, కల్పర్ గ్రామాల మధ్య ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఇద్దరు మావోయిస్టు మృతదేహలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, అయితే ఆ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.