27 June, 2026 | 9:00 PM

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2.63 లక్షల జరిమానా

27-06-2026 07:56 PM

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 23 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీహెచ్ ముత్యంరాజు తెలిపారు. శనివారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు పేర్కొన్నారు. న్యాయమూర్తి విచారణ జరిపి 23 మందికి కలిపి రూ.2లక్షల 63 వేలు జరిమానా విధించారని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 17 మందికి రూ.85 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ఇన్స్పెక్టర్ ముత్యంరాజు పేర్కొన్నారు.