అన్నోజిగూడలో నేటి నుంచి మూడు రోజులపాటు బీకేఎస్ సమావేశాలు
అఖిలభారత అధ్యక్షుడు కండెల సాయి రెడ్డి
ఘట్ కేసర్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): రైతాంగ సమస్యల పరిష్కారం, లాభసాటి ధర సాధనకై భారతీయ కిసాన్ సంఘ్ నిరంతరం కృషి చేస్తుందని అఖిల భారత అధ్యక్షులు కండెల సాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత సమావేశాలు ఈనెల 27 నుండి మార్చి 1 వరకు మూడు రోజులపాటు పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడరాష్ట్రీయ విద్యా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
భారతీయ కిసాన్ సంఘ్ యొక్క అఖిల భారత అధ్యక్షులు కె. సాయి రెడ్డి భారతమాత పూజ భగవాన్ బలరాం దీపప్రజ్వలన, ధ్వజారోహణ చేశారు. ఈసమావేశంలో దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ విధానాలు, ధరల హామీ, సాగు ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. రైతుల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగ బలోపేతం, స్వదేశీ వ్యవసాయ విధానాల ప్రోత్సాహానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నారు.




