20-01-2026 12:00:00 AM
నూతనకల్, జనవరి 19: మండల పరిధిలోని బిక్కుమల్ల గ్రామంలో గత వారం జరిగిన మహిళ మెడలోని మంగళసూత్రం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ నరసింహారావు, సీసీఎస్ సీఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎర్రపహాడ్ ఎక్స్ రోడ్డు వద్ద తుంగతుర్తి సీఐ ఏ. నరసింహారావు, సీసీఎస్ సీఐ శివకుమార్ తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా, బ్పై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించారు.
వారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కట్టరీ యువరాజ్, దామల రాజేష్లుగా గుర్తించారు. ఈ నెల 12న బిక్కుమల్లలో మంగళసూత్రం లాక్కెళ్ళినట్లు నిందితులు ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ తనిఖీల్లో నూతనకల్ ఎస్త్స్ర నాగరాజు, పీసీలు శ్రీనివాస్, ఆనంద్, మల్లేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.