13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

బాల్య వివాహాల నిర్మూలన అందరి భాద్యత

20-01-2026 12:00 AM

మోతె, జనవరి 19 : బాల్య వివాహల నిర్మూలన ప్రతిఒక్కరి భాధ్యత అని గోపతండా సర్పంచ్ భూక్య బిక్కు, నేరడవాయి సర్పంచ్ దారమళ్ళ గోవర్ధన్, తుమ్మ గూడెంసర్పంచ్ కుక్క ధనమ్మ బిక్షం అన్నారు. సోమవారం మండల పరిధిలోని  గోపతండ, నేరడవాయి, తుమ్మ గూడెం గ్రామాలలో జరిగిన జిల్లా లీగల్ సర్వీస్ ఆధారిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  బాల్య వివాహల నిర్మూలన అనే అంశం పై జరిగిన అవగాహన కార్యక్రమంలో సర్పంచ్ లు బిక్కు గోవర్ధన్ ధనమ్మ బిక్షం మాట్లాడారు.

గ్రామాలలో నేటికీ  చదువు లేక చట్టాల పైన అవగాహన లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామాలలో చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేయడంతో మానసిక వికాసం శారీరక దృఢత్వం ఉండదని జబ్బుల బారిన పడి కుటుంబం చిన్నభిన్నం అవుతుందని ఆర్ధిక ఇబ్బందులతో కటుంబ వ్యవస్థ వీధిన పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ ఆధారిటి కోఆర్డినేటర్ గుద్దేటి వెంకన్న, పి యల్ వి లు పల్లెల లక్ష్మణ్, యస్ కృష్ణవేణి గట్టిగుండ్ల రాము, గ్రామ ఉప సర్పంచ్ లు మాలోతు ఈశ్వరి రవి, కొచ్చర్ల సుజాత శ్రీను, ఉబ్బపల్లి ఈదయ్య, వార్డ్ మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.