ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
దొంగ ఒక్కడే... 18 ద్విచక్ర వాహనాలు అపహరణ
వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి సతీష్ కుమార్
పాల్వంచ,(విజయక్రాంతి): సులభంగా డబ్బు సంపాదించడం, జలసాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్న ఓ వ్యక్తిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి దొంగలించిన 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ సతీష్ కుమార్ వివరాలను వెల్లడించారు. శనివారం ఉదయం రూరల్ ఎస్సై నరేష్ తన సిబ్బందితో సోమల గూడెం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఓ వ్యక్తి భద్రాచలం వైపు నుంచి పాల్వంచకు వస్తున్నాడు.
పోలీసులను చూసిన ఆ వ్యక్తి అనుమానాస్పదంగా తచ్చాడుతూ వెనుదిరిగే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని పట్టుకొని అతని వద్ద ఉన్న టీఎస్ 04 ఈ జె 2 9 0 1 గ్లామర్ ద్విచక్ర వాహనం సంబంధించిన పత్రాలను అడిగితే చూపించలేకపోయాడు. అతని ప్రవర్తన వ్యవహారం వనమాస్పదంగా ఉండటంతో ఎస్సై గట్టిగా ప్రశ్నించడంతో బైకులు దొంగతనం చేస్తున్నట్లు అంగీకరించాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు.
18 ద్విచక్ర వాహనాలు చోరీ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన సొంతపురి రమేష్ గా పోలీసులు అతని గుర్తించారు. కొద్దిరోజుల క్రితం కేశవాపురం లోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ వద్ద దొంగతనం చేశానని రమేష్ పోలీసులు ఎదుట అంగీకరించా. చల్సాలకు చెడు వ్యసనాలకు సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలకు అలవాటు పడి గత ఆరు నెలలుగా జిల్లాలోని కొత్తగూడెం పాల్వంచ భద్రాచలం మణుగూరు ఇల్లందు ప్రాంతాల్లో 18 ద్విచక్ర వాహనాలను దొంగ తనం చేసినట్లు విచారణలో వెల్లడయింది. వాటిల్లో ఆరోగ్య చక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి వెల్లడించారు. మిగిలిన ద్విచక్ర వాహనాల కోసం విచారణ చేపట్టామన్నారు. ఈ సమావేశంలో సిఐ సతీష్ , రూరల్ ఎస్సై సురేష్ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




