5 July, 2026 | 6:24 PM

ఆగస్టు 2న ఏఐటీయూసీ జిల్లా మహాసభలు జయప్రదం చెయ్యండి

05-07-2026 05:48 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఆగస్టు 2 ఏఐ టీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ యూనియాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసుపిలుపునిచ్చారు. బెల్లంపల్లి CPI కార్యాలయంలో మహాభల  పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ... కార్మికుల హక్కుల కోసం నిరంతరం రాజీలేని సమరశీల పోరాటాలు చేస్తూ దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి ట్టమొదటి కార్మిక సంఘం AITUC అని పేర్కొన్నారు.

భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలోనే దేశంలోని కార్మికులను ఐక్యపరిచి 1920 అక్టోబర్ 31న బొంబాయి నగరంలో AITUC అవిర్భవించిందనీతెలిపారు. నాటి నుంచి నేటి వరకు కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నడుతున్నదన్నారు. కనీస వేతనాలు చట్టం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు AITUC పోరాటాల వల్లనే వచ్చినవన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుక్ను కార్మిక చట్టాలను నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పెట్టుబడి దారులకు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్పులు చేస్తూ 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ పేరుతో కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారనీ విమర్శించారు. కనీస వేతనాలు PF, ESI చట్టాలు అమలుకు నోచుకోలేదన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్రచట్టాలు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలం అయ్యారనీ దుయ్యబట్టారు. అంగన్వాడి ANM, ఆశ, RTC మధ్యాహ్న భోజనం, జీపు కారు 104, 108, హాస్పిటల్ కార్మికులు, హమాలీ, ఆటో, భవన నిర్మాణ రంగం గ్రామ పంచాయతీ కార్మికులు, లారీ డ్రైవర్లు, పెయింటింగ్, సెంట్రింగ్, టైల్స్, మార్బుల్ ఇతర రంగాల కార్మికుల వేతనాలు పెరగక ఉపాధి దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారునీ తెలిపారు.

కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4లేబర్ కోడ్లను రద్దు చేయాలనీ, కనీస వేతన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మిట్టపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి శాంతిగని, బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ బియ్యాల వెంకటస్వామి, శాంతిఖని మైన్ ఫిట్ కార్యదర్శి రత్నం ప్రవీణ్, దాడి రమేష్ , నాయకులు రత్నం రాజం, కొంకుల రాజేష్,  జాడి పోచం, సాకే శ్రీనివాస్, రామకృష్ణ, పాల్గొన్నారు.