5 July, 2026 | 6:55 PM

పోచ్చర జలపాతానికి సందర్శకుల తాకిడి

05-07-2026 05:51 PM

బోథ్: మండలంలోని పొచ్చెర జలపాతానికి సందర్శకుల తాకిడి మొదలైంది. ఇటీవల వర్షాలు కురవడంతో జలపాతం అందాలను తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు ఆదివారం సెలవు కావడంతో ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్మల్ జిల్లాల నుండి సందర్శకులు తరలివచ్చారు.

జాలువారుతున్న జలపాతం అందాలను చూస్తూ సందర్శకులు మై మర్చిపోయారు చిన్న పిల్లలతో పాటు పెద్దలు జలపాతం వద్ద ఉన్న ఊయలలో ఉంగుతూ సందడి చేశారు. సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం వద్ద ప్రభుత్వం మరిన్ని వసతులు కల్పించాలని సందర్శకులు కోరుతున్నారు అంతేగాక జలపాతం వద్ద రక్షణ చర్యలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.