1 June, 2026 | 2:46 AM

అమ్మవారి ఆశీస్సులతో భక్తి సంద్రంగా బోనాల వేడుకలు

01-06-2026 01:02 AM

మైసమ్మ, నల్ల పోచమ్మ దేవాలయ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ 

నాగోల్, మే 31 (విజయక్రాంతి): కొత్తపేట డివిజన్ పరిధిలోని కమర్షియల్ టాక్స్ కాలనీ కమాన్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ మైసమ్మ దేవాలయం రెండు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన బోనాల మహోత్సవంలో మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన భక్తులతో కలిసి బోనాల ఉత్సవాల్లో పాల్గొని మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం కార్యక్రమానికి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకోటి పవన్ కుమార్ మాట్లాడుతూ, ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని, ఆలయ అభివృద్ధి, భక్తుల సంక్షేమం మరియు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో శ్రీ మైసమ్మ దేవాలయ కమిటీ సభ్యులు, నల్ల పోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు, బీజేపీ నాయకులు వగ్గుల సుందర్ నారాయణ పాల్గొన్నారు. భక్తుల సందోహంతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.