calender_icon.png 8 October, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ బాలిక అత్యాచార సంఘటనలో ఇద్దరు యువకులు రిమాండ్

08-10-2025 07:05:47 PM

సన్నిహితంగా ఉన్న సమయంలో రక్తస్రావం జరగడంతో మృతి..

నల్గొండ క్రైమ్: మైనర్ బాలిక మృతి అత్యాచార సంఘటనలో ఇద్దరు వ్యక్తులను నల్గొండ టూ టౌన్ పోలీసులు రిమాండ్ చేశారు. వారి నుండి ఆటో, పల్సర్ బైకును స్వాధీనం చేసుకున్నారు. నేర సంఘటన వివరాలను బుధవారం నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నల్గొండ మండలంలోని జీకే అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ సమీప గ్రామానికి చెందిన మైనర్ బాలికతో గత 3 నెలల నుండి పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. మంగళవారం ఇంటి నుండి కళాశాలకు వచ్చిన బాలికను తన స్నేహితుడైనా రసూల్ పురం గ్రామానికి చెందిన మధును ఆటలో తీసుకురమ్మని చెప్పగా మధు ఆటో నడుపుతూ కిరాయికి ఉంటున్న రూమ్ లోకి తీసుకెళ్లాడు.

కృష్ణ బలహీనంగా ఉన్న మైనర్ బాలికతో సన్నిహితంగా ఉన్న సమయంలో రక్తస్రావం జరగగా అపస్మారక స్థితిలోకి వెళ్ళి మృతి చెందింది. కృష్ణ తెలిసిన వ్యక్తికి జరిగిన విషయమై సమాచారం ఇవ్వగా, ఆ వ్యక్తి పోలీసులకు తెలియజేశారు. తరువాత పోలీసు స్టేషన్ లో తాను చేసిన నేరం ఒప్పుకొని లొంగిపోయినట్లు తెలిపారు. సహకరించిన మధును అదుపులోకి తీసుకొని విచారణ చేసి వారి వాహనములు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తము కోర్ట్ లో హాజరపరిచినట్టు తెలిపారు. కేసును దర్యాప్తు చేసిన సీఐలు రాఘవ రావు, రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐ సైదులును, సిబ్బందిని, జిల్లా ఎస్‌పి శరత్ చంద్ర పవర్ అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు