calender_icon.png 8 October, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కమిటీ ఈనెల 10న ఎన్నిక

08-10-2025 07:01:22 PM

సంఘం మండల అధ్యక్షుడు పాలవరపు సంతోష్..

తుంగతుర్తి (విజయక్రాంతి): రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తుంగతుర్తి శాఖ కమిటీ ఎన్నిక ఈనెల 10న నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు పి సంతోష్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగ సంఘం సర్వసభ్య సమావేశం ఈనెల 10న తుంగతుర్తిలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం 2025-28 సంవత్సరాల కాలం నూతనంగా ఎన్నికలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ సమావేశానికి మండల యూనిట్ అందరూ సభ్యులు సకాలమునకు హాజరు కాగలరని కోరారు. ఆయనతో పాటు విశ్రాంత ఉద్యోగుల మండల కార్యదర్శి పుల్లయ్య పాల్గొన్నారు.