calender_icon.png 22 October, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ20 వరల్డ్‌కప్ చివరి బెర్త్ యూఏఈదే

17-10-2025 01:00:10 AM

ఒమన్, అక్టోబర్ 16 : వచ్చే ఏడాది భార త్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడే 20 జట్లు ఖరారయ్యా యి. తాజాగా ఈ మెగాటోర్నీలో మిగిలిన చి వరి బెర్తును యూఏఈ దక్కించుకుంది. ఈ స్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్‌లో జ పాన్‌పై విజయంతో యూఏఈ వరల్డ్‌కప్‌కు అ ర్హత సాధించింది. జపాన్ 116 పరుగులు చే యగా.. యూఏఈ కేవలం 12.1 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఇప్పటికే ఒమన్, నేపాల్ కూడా ప్రపంచకప్‌కు క్వాలిఫై అ య్యాయి.

2026 టీ20 ప్ర పంచకప్‌కు ఆతిథ్య హోదాలో భారత్, శ్రీలంక నేరుగా అర్హత సాధిస్తే.. గత ప్రపంచకప్‌లో సూప ర్‌స్త్ర8 స్టేజ్ కు చేరడం ద్వారా ఆప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, యూఎస్‌ఏ కూడా క్వాలిఫై అయ్యాయి. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ జట్లు అర్హత సాధిస్తే.. క్వాలిఫయర్స్ ద్వారా కెనడా, నెదర్లాండ్స్,  ఇటలీ, నమీబియా, జింబాబ్వే చోటు దక్కించుకున్నాయి.