17-10-2025 01:01:13 AM
న్యూఢిల్లీ,అక్టోబర్ 16: ప్రో కబడ్డీ 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గత మ్యాచ్ లో బెంగాల్ వారియర్స్‌పై ఓడిన తెలుగు టైటాన్స్ తాజాగా యూ ముంబా చేతిలో పరాజయం పాలైంది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో యూ ముంబా 33 స్కోర్‌తో విజయం సాధించింది.
కెప్టెన్ విజయ్ మాలి క్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 10 పాయింట్లు సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. యూ ముంబా రైడర్లు కీలక సమయాల్లో పాయింట్లు స్కోర్ చేసి తమ జట్టును ఆధిక్యంలో నిలుపుతూ వచ్చారు. యూ ముంబా జట్టులో రైడర్ అజిత్ చౌహాన్(8) పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో తెలుగు టైటాన్స్ మూడో స్థానంలో ఉండగా.. యూ ముంబా నాలుగో ప్లేస్‌లో నిలిచింది.