calender_icon.png 16 October, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోకో మెరుస్తారా ?

16-10-2025 01:18:34 AM

ఆస్ట్రేలియాకు బయలుదేరిన టీమిండియా

-రోహిత్, కోహ్లీపైనే అందరి చూపు

-19 నుంచి వన్డే సిరీస్

ముంబై,అక్టోబర్ 15: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ముగిసింది. సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన టీమిండియా 2 తో సిరీస్‌ను స్వీప్ చేసింది. ఇప్పుడు వైట్‌బాల్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా బయలుదే రి వెళ్ళింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోహిత్,కోహ్లీ ద్వ యం రీఎంట్రీ ఈ సిరీస్‌తోనే జరగబోతోం ది.

2027 వన్డే ప్రపంచకప్ ఆడాలని లక్ష్యం గా పెట్టుకున్న వీరిద్దరూ ఆసీస్‌ను కంగారెత్తిస్తారా.. తమలో ఇంకా ఆడే సత్తా తగ్గలేదని ఆటతోనే చూపిస్తారా...ఈ సిరీస్‌లో ఫెయిలైతే వరల్డ్‌కప్ జట్టులో చోటు కష్టమేనా.. ప్రస్తుతం  అభిమానులను వేధిస్తున్న ప్రశ్న లు ఇవే.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా తరపున తొలిసారి గ్రౌండ్‌లో అడు గుపెట్టబోతోన్న రోకో ద్వయంపైనే అందరి చూపు ఉంది.

నిజానికి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత సీనియర్లు ఒక్కొక్కరుగా జట్టును వీడుతున్నారు. ఇప్పటికే కోహ్లీ, రోహిత్‌శర్మ సైతం టెస్టులకు, టీ20లకు గుడ్ బై చెప్పేశారు. వీటిలో టీ20 రిటైర్మెంట్ ఊ హించిందే అయినా రెడ్ బాల్ క్రికెట్ నుంచి వీరిద్దరూ తప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. అలాగే అశ్విన్ కూడా గత ఏడాది ఆసీస్ టూర్ మధ్యలోనే రిటైర్మెంట్ ఇచ్చేశాడు.అదే సమయంలో జట్టులో యువ ఆటగాళ్ళకు ప్రాధాన్యత పెరిగింది.

సుదీర్ఘ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని గంభీర్ యువ జట్టును తీర్చిదిద్దుతున్నాడు. ఈ క్ర మంలోనే వచ్చే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఉంటారా లేదా అన్న దానిపై చర్చ జ రుగుతూనే ఉంది. మరో రెండేళ్ళ పాటు తమ ఫామ్,ఫిట్‌నెస్ ఎంతవరకూ కొనసాగిస్తారనేది ఈ డౌట్స్ రావడానికి కారణమవు తోంది. దీనిపై చీఫ్ సెలక్టర్ అగార్కర్, హెడ్ కోచ్ గంభీర్ సైతం క్లారిటీ ఇవ్వలేకపోయా డు. ఆశ్చర్యం ఏమిటంటే ఒకవేళ ఫామ్,ఫిట్‌నెస్ కొనసాగిస్తే జట్టులోకి ఎంపిక చేస్తారా అనేది కూడా గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. 

అయితే వీరి వాదన ఎలా ఉన్నా ఆస్ట్రేలి యా సిరీస్ మాత్రం రోకో ద్వయానికి అత్యం త కీలకమనే చెప్పాలి. ఎందుకంటే ఆసీస్ లాంటి జట్టుపై వారి సొంతగడ్డ మీద దుమ్మురేపితే అంతకంటే కావాల్సిందేముంటుంది. పైగా కంగారూలంటేనే చాలు వీరిద్దరూ రెచ్చిపోతారు. తాము వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో ఉండాలం టే ఖచ్ఛితంగా ఆసీస్‌తో సిరీస్‌లో అదరగొట్టాల్సిందే అన్న విషయం రోహిత్, కోహ్లీలకు కూడా తెలు సు. తర్వాత వరుసగా అవకాశాలు దక్కుతాయా లేదా అన్నది కూడా అనుమానమేనంటూ మాజీ కోచ్ రవి శాస్త్రి సైతం వ్యాఖ్యానించాడు.

అదే సమయం లో చీఫ్ సెలక్టర్ అగార్కర్ చెప్పినట్టు దేశ వాళీ క్రికెట్ కూడా ఆడాల న్న కండీషన్‌ను  రోహిత్, కోహ్లీ ఎంతవరకూ పాటిస్తారో చూడాలి. గతంతో పోలిస్తే స్లిమ్‌గా మారిన రో హిత్ కూడా ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నా డు. అటు కోహ్లీ ఫిట్‌నెస్ విషయంలో ఎలాంటి సం దేహాలు అక్కర్లేదు. తన ఫా మ్ కంటిన్యూ చేస్తే చాలు వరల్డ్‌కప్ జట్టులో ఖచ్చితంగా అతనికి ప్లేస్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్ ఒకవిధంగా కోహ్లీ, రోహిత్ ఫ్యూచర్‌ను డిసైడ్ చేయబోతోంది.