6 July, 2026 | 4:40 PM

Breaking News

భగీరథ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి   •   ఏటీఎంగా మార్చుకునేందుకే కాళేశ్వరం   •   అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •  

ఓకే గదిలో రెండు కార్యాలయాల నిర్వహణ

20-03-2026 12:00 AM

తికమక పడుతున్న ప్రజలు

తాండూరు, మా ర్చి 19 (విజయక్రాం తి): ఓకే గదిలో రెం డు వేరువేరు కార్యాలయ నిర్వహణతో ప్రజలు తికమక పడుతున్నారు. వికారాబాద్ జిల్లా తాం డూరు పట్టణంలో శాంతినగర్ కాలనీలో పాత మీసేవ ప్రభుత్వం భవనంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తో పాటు ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఒకే హాల్ లో కొనసాగుతున్నాయి.  దీంతో కార్యాలయానికి వివిధ సమస్యలపై వచ్చే ప్రజలు ఓకే ప్రధాన ద్వారం ద్వారా కార్యాలయం లోపలికి వచ్చాక సీన్ చూసి ఆశ్చర్యానికి  గురవుతున్నారు.

ఇదివరకు ఎక్సైజ్ కార్యాలయం ఓ ప్రైవేటు అద్దె భవనంలో కొనసాగేది ఇటీవల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లోకి కార్యాలయాన్ని మార్చారు. ఓ గంజాయి కేసులో విలేకరుల సమావేశానికి వెళ్లిన విలేకరులు సైతం అక్కడి పరిస్థితిని చూసి అవక్కయ్యారు .రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయాన్ని ఇచ్చే  ఆప్కారి ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడం ఏంటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.