అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
రాజంపేట (విజయక్రాంతి): అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజంపేట మండలం(Rajampet Mandal) ఆర్గోండ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. రాజంపేట ఎస్సై పుష్పరాజ్(SI Pushparaj) చెప్పిన వివరాల ప్రకారం.. ఆర్గోండ గ్రామానికి చెందిన జంగిటి పెంటయ్య(48) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలు నెరవేర్చేవాడని, తనకు ఇద్దరు కుమార్తెలు కలరని తెలిపారు.
కుమార్తెల పెళ్లిల సమయంలో ఏర్పడిన అప్పుల వల్ల, ఈ సంవత్సరం తన వ్యవసాయ భూమిలో పంటల దిగుబడి రాక ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయడని అన్నారు. దీంతో అప్పుల బాధ ఎక్కువ కావడంతో తీవ్ర మానసిక వేదనకు గురై శనివారం ఉదయం పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి మృతి చెందారని పేర్కొన్నారు. భార్య రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.






