17 July, 2026 | 3:34 AM

అనుమతుల్లేని పాఠశాల సీజ్

23-06-2024 12:05 AM

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 22 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి గ్రామ పరిధిలోని రివర్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ యజమాన్యం పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయకుండానే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించింది. ఆకట్టుకునే బ్రోచర్లతో అడ్మిషన్లకు తెరలేపింది. అడ్డుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు పాఠశాల నిర్వాహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనిపై ఈనెల 19న విజయక్రాంతి దినపత్రికలో ‘భవనం లేకున్నా.. బడికి అనుమతి’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఈ కథనంపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. శనివారం పాఠశాలను సందర్శించిన అనంతరం సీజ్ చేస్తున్నట్లు  అబ్దుల్లాపూర్‌మెట్ ఎంఈవో వెంకట్‌రెడ్డి తెలిపారు.