17 July, 2026 | 3:13 AM

తాండూరు డివిజన్‌కు ప్రత్యేక హోదా

23-06-2024 12:05 AM

వికారాబాద్, జూన్ 22 (విజయక్రాంతి) : వికారాబాద్ జిల్లాలోని తాండూరు డివిజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను కల్పిస్తూ శనివారం ఉత్తర్వూలు జారీ చేసింది. తాజాగా రాష్ట్రంలోని 15 డివిజన్లకు ప్రత్యేక హోదా కల్పించగా అందులో తాండూ రు కూడా ఉంది. ఇప్పటి వరకు తాండూరు రెవెన్యూ డివిజన్‌లో ఆర్డీఓ స్థాయి అధికారులు మాత్రమే పాలన చూసుకునే వారు. ప్రత్యేక హోదా దక్కడంతో ఇక్కడ ఐఏఎస్ అధికారిని సబ్ కలెక్టర్ హోదాలో కేటాయించనున్నారు. ఈ నిర్ణయంతో తాండూరు అభివృద్ది చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.