కాంగ్రెస్ జెండా నీడలోనే కడవరకు
శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
వనపర్తి, మార్చి 12 ( విజయక్రాంతి ) : కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే పార్టీ లైన్లోనే కడవరకు పని పనిచేయాలని పార్టీలైన్ తప్పకూడదని పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని వనపర్తి శాసనస భ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఆర్ జి గార్డెన్స్ లో నిర్వహించిన వనపర్తి మండల మరియు పట్టణ కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన డీసీసీ అధ్యక్షులు శివసేనరెడ్డి , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి నుంచి మరో 15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని ప్రతిపక్షాలకు ఎలాంటి తావులేదు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని బీజేపీ పార్టీ ఆంధ్రాలోని చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లు ఇచ్చిన సపోర్టుతో చివరి దశలో అధికారంలోకి వచ్చిందని నేడు బిజెపి పార్టీ వెం టిలేటర్ పై ఉందని అలాంటి పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరం భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసేంతవరకు ఉశ్రమంచకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం గ్రామస్థాయి నుంచి పార్టీని పట్టిష్టపరిచేందుకు అధిష్టానం నేడు ప్రత్యేక చర్యలు చేపట్టిందని అందులో భాగంగానే నేడు గ్రామ కమిటీలు మండల కమిటీలు అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేస్తుందని, దీంతో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి సమచిత స్థానం లభిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు.
వనపర్తి పట్టణంలో 50 కోట్ల రూపాయలతో 33 వార్డుల్లో సీసీ రహదారుల నిర్మాణం రూ 70 కోట్ల రూపాయలతో కరెంట్ సమస్యల పరిష్కారం, రూ 70 కోట్ల రూపాయలతో అమృత్ స్కీం ద్వారా తాగునీటికి సంబంధించిన ఈ విధంగా పనులను చేపట్టడం జరిగిందని రూ 50 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం చేపట్టామని రూ 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం, రూ 250 ఒక్క రూపాయలతో 500 బెడ్ల హాస్పిటల్ నిర్మాణం రూ 81 కోట్ల రూపాయలతో కోర్టు బిల్డింగ్ నిర్మాణం, రూ 50 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి విద్యాభ్యాసం చేసిన పాఠశాలను అధునాతనంగా నిర్మించుకోవడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ జర్మన్ సెక్రెటరీ నందిమల్ల యాదయ్య, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతియ్య, మైనార్టీ నాయకులు రహీం, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, మండల అధ్యక్షులు రవి కిరణ్, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు, వనపర్తి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




