20-02-2026 12:00:00 AM
పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ
సనత్‌నగర్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి):- ఛత్రపతి శివాజీ మహరాజ్ అంద రికీ ఆదర్శప్రాయుడని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. గురువారం అమీర్‌పేట డివిజన్‌లో జనతా రాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొని అయన విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.
ఈ క్రమంలో డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, పరిపాలనలో చూ పిన ప్రతిభ యువతకు ఆదర్శమనిన్నారు. వేడుకల్లో భక్తిగీతాలు, నినాదాలు, ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.