యువతకు ముప్పుగా యాప్‌లు!
దేశంలో సోషల్ మీడియా వాడ కం మన నిత్య జీవితంలో అవసరంగా మారిపోయింది. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరుగుతున్నా వివిధ అం శాలను, ముఖ్యంగా యువతను ఇది గణనీయంగా ప్రభావితం చేస్తోంది. సామాజిక మాధ్యమం ప్లాట్‌ఫామ్‌లు మన కమ్యూనికేషన్, మన అభిప్రాయాన్ని వ్యక్తపరచడా నికి, సమాచారాన్ని ప్రతీ ఒక్కరికీ తెలియజేసే అవకాశాలను పెంచుతున్నాయి.
కాని కొన్ని సందర్భాల్లో అవి మానసిక ఆరోగ్యానికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగంతో పాటు చేతిలోని స్మార్ట్‌ఫోన్ పొట్టలో దాగిన సామాజిక మాధ్యమాలు లేదా సోషల్ మీడియా తలుపులు తెరుస్తున్న మంచి కంటే చెడు అలవాట్లే ముం దుగా గుర్తుకు తెస్తున్నాయి.
ఆధునిక శాస్త్ర సాంకేతిక విప్లవం ద్వారా ఇవాళ ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. దేశ సరిహద్దులు కాగితాల వరకే పరిమితమయ్యాయి. అడిగిందే తడవుగా సమాచారం గుట్టలు గుట్టలుగా గూగుల్ తల్లి వడ్డించి పెడుతున్నది. ప్రజలు, ముఖ్యంగా యు వత చేతిలోని స్మార్ట్‌ఫోన్ శరీరంలో ఒక అంగమై తిష్ట వేసింది. అడిగిన సమాచారమే కాకుండా అక్కరలేని సమాచారాన్ని అడగక ముందే కళ్ల ముందుంచుతున్నది. స్మార్ట్‌ఫోన్‌ను సద్వినియోగం చేసుకున్న వారు అభివృద్ధి చెందుతున్నారు. స్మార్ట్‌ఫో న్ దురలవాటు వలయంలో చిక్కిన వారు అధోగతిపాలు అవుతున్నారు.
యాప్‌ల వరద..
సోషల్ మీడియా యాప్‌లు మనకు తెలియకుండానే, మనల్ని వశపరుచుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్‌లో దూరిన వాట్సా ప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్, మెసెంజర్, లింక్‌డిన్ లాంటి అనే క సామాజిక మాధ్యమాలు కుప్పలు తెప్పలుగా సమాచారాలను మన చెంతకు చేర వేస్తున్నాయి. వీటిలో అక్కరకురాని సమాచారమే అధికంగా ఉంటున్నది. సామాజిక మాధ్యమాలను మనం నియంత్రించడానికి బదులు అవే మనల్ని బానిసలుగా మార్చి మానసిక వేదనకు గురి చేస్తున్నా యి. సామాజిక మాధ్యమ చెరసాల్లో గం టల కొద్ది ఒంటరిగా బతుకులు ఈడుస్తు న్నాం.
అ’సామాజిక మాధ్యమాల’ దండయాత్ర ఇలాగే కొనసాగితే రాబోయే అకా లంలో నాగరికత పునర్నిర్వచించబడుతుంది. మనిషి ఒంటరి పక్షి అవుతాడు. మానవత్వం మంటగలుస్తుంది. కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. బంధాలు బల హీనపడతాయి. బంధుత్వాలు వాణిజ్య వ స్తువులుగా మారిపోతాయి.డిజిటల్ యు వతరం నిర్వీర్యం అవుతుంది. అశ్లీలతలే అర్హతలుగా మారిపోతాయి. మృగాళ్లు రె చ్చి పోతారు. సంఘజీవి అసాంఘీక శక్తిగా ఎదుగుతాడు. మానసిక రోగాలు చుట్టుముడతాయి.
దుష్ప్రభావాలెన్నో..
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు త ప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చే యగలవు. ఇది అపోహలకు, కొన్నిసార్లు ప్రమాదకరమైన చర్యలకు దారి తీస్తుంది. ఈ మధ్య మనుషుల మధ్య కమ్యునికేషన్ వ్యవస్థ తగ్గి వర్చువల్ కమ్యూనికేషన్‌పై అతిగా ఆధారపడటం అనేది ఎక్కువైపోయింది. ఇది మనలను సామాజికంగా ఒం టరిగా మన చుట్టూ ఉన్న బంధాలను వి చ్ఛిన్నం చేస్తుంది.
సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు విద్యార్థులను వారి చదువుల నుంచి దూరం చేస్తుంది. అర్ధరాత్రి సోషల్ మీడియా వినియోగం నిద్రకు అంతరా యం కలిగించి, విద్యార్థులపై ప్రతికూల ప్ర భావితం చేస్తుంది. దీనిని అధికంగా ఉపయోగించడం వల్ల మనం అధ్యయనం చే యాల్సిన స్కిల్స్, మనలో ఉత్పాదకత పెం చగల నైపుణ్యం, అభివృద్ధి వంటి వాటిపై వెచ్చించాల్సిన విలువైన సమయాన్ని వృ ధా చేసుకోవడమే అవుతుంది.
యువతను ఆకర్షించే విధంగా ఆన్‌లైన్ గేమ్స్, ఆన్‌లైన్ స్కాముల వలలో పడి, వారిపై తీవ్ర మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. అదీగాక ఆత్మహత్యల దిశగానో, సైకోటిక్ బిహేవియర్ పెరిగి సమాజానికి యువతే ప్రమా దకారి అయ్యే విధంగా చేస్తుందనడంలో సందేహం లేదు.
కట్టడికి మార్గాలు..
యాప్స్‌కి, డిజిటల్ పరికరాలను ని యంత్రించేందుకు ఇప్పటికే తల్లిదండ్రులకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. టిక్ టాక్ 2023లో 18 ఏళ్ల లోపు వారికి డిఫాల్ట్‌గా 60 నిమిషాల స్క్రీన్ సమయ పరిమి తిని ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ అన్ని వ యసుల వినియోగదారులను వారి స్వంత పరిమితిని సెట్ చేసుకోమంటుంది. ఎంత సమయం బ్లాక్ చేయవచ్చో కూడా ఎంచుకోవచ్చు. 2021లో చైనా ఆల్‌లైన్ గేమింగ్ పై కఠినమైన ఆంక్షలు విధించింది. వారాంతాల్లో, సెలవు దినాల్లో మాత్రమే 18 ఏళ్ల లోపు గేమర్స్‌ను రోజుకు ఒక గంటకు పరిమితం చేసింది.
సెలవు దినాల్లో మూడు గంటలకు పెంచింది. యువతపై గేమింగ్ ప్రభావం గురించి తన ఆందోళనలను ఉదహరించి, మరీ ఈ నిబంధనలను వి ధించింది మన కేంద్ర ప్రభుత్వం. కానీ గత సంవత్సరం డ్రాఫ్ట్ అప్‌డేట్ ప్రభుత్వ వెబ్‌సైట్ నుంచి అదృశ్యమైంది. ప్రభుత్వాలు అమలు చేయాలనే కఠిన నిబంధనలకన్నా ముందు కౌమారదశలో ఉన్న పిల్లలకు డి జిటల్ సేవలు ఎలా పొందాలో అవగాహ న కల్పించడం ముఖ్యమన్న విషయం తె లుసుకోవాలి.
94 శాతం మంది..
నేడు ప్రపంచవ్యాప్తంగా 5.66 బిలియన్లకు (జనాభాలో 68.7 శాతం) పైగా సా మాజిక మాధ్యమ వినియోగదారులు ఉ న్నారు. విశ్వవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో సగటున రోజుకు 2 గంటల 25 ని మిషాల పాటు మునిగి తేలుతున్నారు. ఒక వ్యక్తి తన సగటు జీవితకాలంలో 7 ఏండ్ల పాటు సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నారు. ప్రపంచ స్థాయిలో 49 శాతం సామాజిక మాధ్యమ వినియోగదారుల్లో 55 శాతం పురుషులు, 45 శాతం మహిళ లు వాడుతున్నట్లు తేలింది. ఇంటర్నెట్ వి నియోగదారుల్లో 94 శాతం సామాజిక మాధ్యమాల్లోనే చక్కర్లు కొడుతున్నారు.
జెన్ - జెడ్ యువత సగటున 3 నుంచి 4 గంటలు సామాజిక మాధ్యమాల్లో మునిగి పోతున్నారు. సామాజిక మాధ్యమ వినియోగదారులు దురలవాటు వలయంలో చిక్కుతున్నారు. గంటల తరబడి సామాజిక మాధ్యమాల్లో సంసారం చేస్తున్న వినియోగదారులు పలు అనారోగ్యాల బారిన ప డుతున్నారు.
సామాజిక బాధ్యతగా..
సామాజిక మాధ్యమాలను సక్రమంగా, తెలివిగా వాడుకోవడం వల్ల వ్యక్తిగత ఉన్న తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, సమాజంతో సత్సంబంధాలు పెరగడం, అవసర సమాచారాన్ని సత్వరమే పొందడం, బ్యాంకింగ్ కార్యకలాపా లను ఇంట్లో నుంచి జరపడం చేయాలి. ఆన్‌లైన్‌లో కోర్టులు పూర్తి చేయడం, ఉద్యో గ సాధన నైపుణ్యాలను పెంపొందించుకోవడం, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనడం, విషయ పరిజ్ఞానాన్ని పొంద డం, ప్రపంచ పోకడలను ఆకళింపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఒంట రితనం కలగడం, కుటుంబ సభ్యుల నుం చి దూరం కా వడం, విచిత్ర విపరీత ప్రవర్తన, మానసిక అసమతుల్యత, పనిలో అ శ్రద్ధ లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సామాజిక మాధ్యమాలు మన జీవితాలను విచ్ఛిన్నం చేయక ముందే జాగ్రత్త పడదాం. సామాజిక మాధ్యమ చెరసాల్లో పడకుండా దూరంగా ఉందాం. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందాం. భవిష్యత్తు భస్మం కాక ముందే జాగ్రత్తల నీ ళ్లు చల్లుదాం. యువత, పిల్లల శ్రేయస్సు కోరి స్మార్ట్‌ఫోన్ సాధనానికి దూరంగా ఉం చుదాం. సామాజిక మాధ్యమాలను అ సాంఘీక కార్యకలాపాలకు ఉపయోగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
వ్యాసకర్త సెల్: 9949700037




