calender_icon.png 11 February, 2026 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

11-02-2026 06:30:40 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): బైక్ ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఎన్ఎఫ్సి బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిపై చెత్త సేకరిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి (50)ని యూనికాన్ బైక్ ఢీ కొట్టడంతో తలకు ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలు అయ్యాయి.

చికిత్స నిమిత్తం ఆ వ్యక్తిని 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ఆరెంజ్ రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని ఇతని గురించి వివరాలు తెలిస్తే వెంటనే ఘట్ కేసర్ పోలీసులకు సమాచారం తెలియజేయాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.