3 August, 2026 | 1:55 AM

సాగు, తాగు.. ఇక ఢోకా లేదు

03-08-2026 01:14 AM

నిండుకున్న నీటి వనరులు 

వరి సాగుపై తొలగిన నీలి నీడలు 

భూగర్భ జలాలు పెరిగే అవకాశం

నిర్మల్ ఆగస్టు 2 (విజయక్రాంతి): కాలం కలిసి వస్తే.. నడిచే కొడుకు పుడతాడు అన్న సామెతకు వర్షం జీవం పోసింది. నిన్న మొన్నటి వరకు నిర్మల్ జిల్లాలో సగటు వర్షపాతం కంటే లోటు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ సాగు పై రైతులు ఆందోళన చెందారు. నిర్మల్ జిల్లాలో జూన్ జూలై మాసంలో వేసిన పత్తి మొక్కజొన్న సోయా ఇతర పంటలు ఎండు ముఖం పట్టగా ప్రాజెక్టుల్లో చెరువుల్లో నీటి సామర్థ్యం లేకపోవ డంతో వరి సాగు ఆశలు వదులుకున్నారు.

కనీసం సాధారణ వర్షాలు కురిసి పత్తి మొ క్కజొన్న సోయపంటకు మేలు చేస్తే చాలని, రైతులు వర్షం కోసం జిల్లా వ్యాప్తంగా పూ జలు యజ్ఞాలు హోమాలు చేశారు. జూన్ మాసంలో 110 మిల్లీమీటర్ల గాను 80 మిల్లీమీటర్లు వర్షం కురువగా, జులై 25 వరకు 175 మిల్లీమీటర్ల గాను110 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. కురువాల్సిన వర్షాల్లో 30% వరకు లోటు వర్షపాతం జిల్లా వ్యాప్తంగా నమోదు కావడం తో భూగర్భ జలాల వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందకు జలసిరి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది 

ఆదుకున్న వర్షం. హాయ్ కట్టుకు భరోసా 

నిర్మల్ జిల్లాలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలు ఆయకట్టుకు రైతాంగానికి ఊపిరి పోసాయి. మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. దీంతో జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుంది. భైంసా గడ్డం వాగు, స్వర్ణ రిజర్వాయర్, సదర్ మార్ట్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భారీగా వరద నీరు పచ్చి చేరింది. వారం రోజుల క్రితం ఎస్సారెస్పీ నీటిమట్టం 1064 అడుగులు (17 టీఎంసీలు) ఉండగా ఆదివారం నాటికి 1075(32 పి ఎం సి లు) చేరుకుంది.

స్వర్ణ రిజర్వాయర్ 1172 నుండి 1182 అడుగులు, భైంసా గడ్డన్న సుద్దవాగు354 నుండి 356 అడుగులకు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభించిన సదర్ మార్ట్ కూడా నిండుకుంది. జిల్లాలోని 679 చెరువుల్లో 50% చెరువులు నిండుకోగా మరో 30% చెరువులు సగానికి పైగా నీరు వచ్చింది. వాగులు గొర్రెలు నీటి ప్రభావం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం జలసిరి కార్యక్రమం జిల్లాలో 1000కి పైగా ఇంకుడు గుంతలు పంట గుంతలు తవ్వడంతో వర్షపు నీరు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

జిల్లాలో శ్రీరాంసాగర్ సరస్వతి కేంద్రాల ద్వారా 36వేల ఎకరాలు, కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు కింద 68 ఎకరాలు, గడ్డన్న సుద్దవాగు 40000, స్వర్ణ క్రింద 36,000, సదర్ మట్ క్రింద 26 వేల ఎకరాలు వరి సాగు కానుంది. అలాగే పంచాయతీరాజ్ నీటిపారుదల శాఖ చెరువుల కింద మరో 12 ఎకరాలు వరి సాగు చేయనున్నారు. ఇప్పటికి ఆయా ప్రాజెక్టుల కింద సాగునీటిపై ఆశలు పెంచుకున్న రైతులు వారి నారు పోసుకొని వరి నాట్ల కోసం ఎదురుచూస్తున్న కాలంలో వర్షాలు జీవం పోశాయి.

నిన్న మొన్న వరకు ఎనీలో ప్రభావం ఉందని వారి సాగు చేయవద్దని ఆర్తోటి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రైతులు కూడా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో వరి పంట వైపు ఆశల వదులు ఉన్నారు. వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకుని సిద్ధమయ్యారు. అయితే రెండు రోజుల్లోనే వర్ణ దేవుడు కరుణించి సాగునీటి ప్రాజెక్టులు నిండుకోవడం చెరువులు నిండిపోవడం తో వరి సాగు ఇక డోకా ఉండదని రైతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

భూగర్భ జలాలు పెరిగే ఛాన్స్ 

నిర్మల్ జిల్లాలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలు భూగర్భ జలాల పెంపు పై భాషలు చిగురింపజేశారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలు చెరువులు ప్రాజెక్టులు , చెక్ డెములు నిండుకోవడం వాగులు వో ర్రెలు ప్రవహించడ, ఇంకుడు గుంతలు పంట గుంతలు నీళ్లు నిలవడంతో భూగర్భ జలాలు తిరిగి అవకాశం ఉంది.

ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 5% ఎక్కువగా వర్షపాతం నమోదయింది. జిల్లాలో సగటున 9.3 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఆగస్టు సెప్టెంబర్ నాటికి ఐదు మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రజల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకుంటేనే భవిష్యత్తులో తాగు తాగునీటికి ఇబ్బంది ఉండదని ఆ దిశగా రైతులు కృషి చేయాలని జిల్లా అధికారులు కోరుతున్నారు.

నీటిపొదుపుపై దృష్టి పెట్టండి 

నిర్మల్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మూడు రోజులుగా కురిసిన వర్షాలు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చాయని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ఇప్పటికి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు చెరువులు పుష్కలంగా వరదనీరు వచ్చేయ డంతో ఖరీఫ్ సీజన్లో తాగు సాగుకు ఇబ్బంది ఉండదు. జలసిరి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు పంట గుంతలు ఏర్పాటు చేయడం వల్ల వర్షపు నీరు గుంతలు నిలిచి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. రైతులు కూడా ఉన్న నీటిని వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకుని జల సంరక్షణకు పాటుపడాలి.

భవేష్ మిశ్రా .జిల్లా కలెక్టర్ నిర్మల్