నకిలీ బంగారంతో బ్యాంకు రుణం
28-04-2026 01:42 PM
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(Telangana Grameena Bank)లో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణం పొందిన విషయంపై కలకలం రేగింది. పట్వారిగుడెంలోని తెలంగాణ గ్రామీణ బ్యాక్ లో నకిలీ బంగారం(Bank Loan) తాకట్టు పెట్టి ఈ మధ్యనే రెన్యువల్ సమయంలో అదే బంగారాన్ని వేరొకరి పేరుతో సుమారు ఏడున్నర లక్షలు రుణం తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై నాగార్జున గ్రామీణ బ్యాంకు మేనేజర్ ను వివరణ కోరడానికి ప్రయత్నించగా మేనేజర్ సెలవు పై వెళ్ళారని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ విషయం జరిగి సుమారు వారం రోజులు కావస్తున్నా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.






