30 August, 2026 | 10:55 AM

Breaking News

10కే పరుగుకు ఐటీ కారిడార్‌ బలి!   •   అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన డీఐసీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్   •   అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి   •   ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య   •   సత్తుపల్లిలో న్యూ జెనెసిస్ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల   •   నేపాల్-టిబెట్ వరదల్లో ఇప్పటివరకు 682 మంది మృతి   •   చెరువులో అనుమానాస్పదంగా చేపల మృతి   •   పాలేరు జలాశయాన్ని పరిశీలించిన ఎస్ఈ   •   రీ-సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ కుమార్ దీపక్   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళకు తీవ్రగాయాలు   •  

జాతీయ సెమినార్‌కు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం

13-07-2026 12:00 AM

పాలమూరు విశ్వవిద్యాలయం జూలై 12: పియూ ఆధ్వర్యంలో ఆగస్టు 7, 8 తేదీలలో కన్హ శాంతి వనంలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక రెండు రోజుల ‘విజన్ ఇండియా 2047 ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్‘ జాతీయ సెమినార్కు అతిథులుగా విచ్చేయాలని కోరుతూ పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ ఆదివారం హైదరాబాద్లో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డిన, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు లను మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక ఆహ్వాన పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు, ఉపకులపతి ప్రత్యేక విధుల అధికారి డాక్టర్ డి. మధుసూదన్ రెడ్డి  పాల్గొన్నారు.