ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక సమ్మిళితం, సురక్షిత బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ (Local Bodies) పి. చంద్రయ్య పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ ఛాంబర్ లో DRDA PD కిషన్, Lead District Manager కె. తిరుపతి, CFL (Cluster Coordinator) రాజశేఖర్, సిబ్బందితో కలిసి పాల్గొని CFL అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా LDM తో కలిసి ఆయన మాట్లాడారు. RBI మార్గదర్శకత్వంలో VIDS ( Voluntary Integrated Development Society) NGO ఆధ్వర్యంలో, Lead Bank (Union Bank of India ) సమన్వయంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
జిల్లాలో 196 వార్డులు, గ్రామాలను ఆర్థిక అవగాహన, ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాల కోసం ఎంపిక చేసిన CFL కేంద్రాలు, సంబంధిత బ్యాంకు శాఖల ద్వారా ప్రజలకు వివిధ బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక భద్రతపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఈ కేంద్రాల ద్వారా CFL కౌన్సిలర్లు ఎంపిక చేసిన గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు ముఖ్యంగా మరణించిన ఖాతాదారుల ఖాతాల పరిష్కారం, నామినేషన్, క్లెయిమ్ ప్రక్రియ, KYC ప్రాముఖ్యత, బ్యాంకింగ్ సేవలు, పొదుపు, బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ, డిజిటల్ బ్యాంకింగ్, UPI, Net Banking వినియోగం సైబర్ మోసాల నివారణ, సైబర్ భద్రత, PMJJBY, PMSBY, APY, SSY తదితర సామాజిక భద్రతా పథకాలు, బ్యాంకు రుణాలు, బాధ్యతాయుతమైన రుణ వినియోగం, బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన, ముఖ్యంగా మరణించిన ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, ఇతర బ్యాంకింగ్ ప్రయోజనాలను నామినీలు/చట్టబద్ధమైన వారసులు సకాలంలో పొందేందుకు అవసరమైన విధానాలపై CFL కౌన్సిలర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. RBI మార్గదర్శకత్వంలో VIDS NGO, Lead Bank Union Bank of India సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలోని ప్రతి వర్గానికి బ్యాంకింగ్ సేవలను చేరువ చేయడం, ఆర్థిక అవగాహన పెంపొందించడం, సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమీపంలోని CFL కేంద్రం లేదా బ్యాంకు శాఖను సంప్రదించి ఈ అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






