30 August, 2026 | 9:57 AM

పాలేరు జలాశయాన్ని పరిశీలించిన ఎస్ఈ

30-08-2026 08:52 AM

పాలేరు రిజర్వాయర్ కు చేరిన సాగర్ జలాలు

తాగునీటి కోసమే పాలేరు జలాలు

కాలువల గేట్లను పరిశీలించిన ఇరిగేషన్ ఎస్ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు

కూసుమంచి, (విజయక్రాంతి): తాగునీటి కోసం నాగార్జున సాగర్ నుండి పాలేరు జలాశయానికి నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ శాఖ ఎస్సీ మంగళపూడి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ లో 15.90 నీటిమట్టం ఉందని జిల్లాకు తాగునీటి కోసం మరియు మిషన్ భగీరథ కోసం పాలేరు జలాశయాన్ని పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగు లకు నింపేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీంతో సాగర్ నుండి 5000 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా దేవులపల్లి నుండి ప్రస్తుతం 2200 క్యూసెక్యుల నీరు పాలేరు జలాసానికి చేరుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నీటిని తాగునీటి కోసం పొదుపుగా వాడుకోవా లని తెలిపారు. కాలువల గేట్ల లీకేజీలు గాని ఇతర లీకేజీలుగా లేకుండా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వర్షభావ పరిస్థితుల వల్ల కేవలం తాగునీటి కోసమే నీటిని నింపుతున్నట్లు ఆయన తెలిపారు.