7 July, 2026 | 7:33 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

మార్పు ఎందుకో కేంద్రం వివరించగలదా?: కేటీఆర్

29-08-2024 11:32 AM

హైదరాబాద్: రాష్ట్రంలో చైనా కంపెనీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక సంవత్సరం క్రితం చైనీస్ ఆటోమేకర్ బీవైడీ తెలంగాణలో బిలియన్ డాలర్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను తిరస్కరించిందని ప్రశ్నించారు. కంపెనీ ఏర్పాటుతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఊపందుకేనేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కంపెనీ ఏర్పాటు ద్వారా వేలాది ఉద్యోగాలు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. చైనా పెట్టుబడులను దేశంలోకి అనుమతిస్తారని కథనాలు వచ్చినట్లు తెలిపారు. మార్పు ఇప్పుడు ఎందుకో కేంద్రం వివరించగలదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.