7 July, 2026 | 6:26 PM

Breaking News

"సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •   డబుల్ మర్డర్ కేసులో సంచలన తీర్పు   •   విడతల వారీగా యూరియా ఇవ్వడం సరికాదు   •   మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు   •  

సత్యమేవ జయతే.. 165 రోజుల తర్వాత మళ్లీ 'ఎక్స్‌'లో కవిత పోస్ట్

29-08-2024 11:50 AM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎర్రవల్లికి బయలుదేరారు. మధ్యాహ్నం ఎర్రవల్లిలో కవిత కేసీఆర్ ను కలవనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో 5 నెలలకు పైగా జైల్లో ఉన్న కవిత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ నెల 27న విడుదలయ్యారు. పదిరోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని కవిత వెల్లడించారు. సహకరించాలని నేతలు, కార్యకర్తలు, అభిమానులను కవిత కోరారు. అటు సత్యమేవ జయతే అని ఎక్స్ వేదికలో కవిత పోస్టు చేశారు. మార్చి 14న ఎక్స్ లో వేదికగా కవిత చివరి పోస్టు చేశారు. మార్చి 15న కవిత అరెస్టు, ఈ నెల 27న బెయిల్ పై బయటకు వచ్చారు. 165 రోజుల తర్వాత మళ్లీ ఎక్స్ వేదికగా కవిత పోస్టు చేశారు.