17 April, 2026 | 3:57 PM

తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?

17-04-2026 02:53 PM

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ కారులను.. దేశభక్తులుగా తేజస్వీ సూర్య పోల్చారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) వెల్లడించారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను వక్రీకరించారని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కట్టుగా నాటకాలు ఆడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల(Women's Reservation Bill) విషయంలో బీజేపీకి మైలేజ్(BJP's Political Mileage) రాకూడదని ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి(Revanth Reddy) కాదా?, అలాంటి సీఎం కేబినెట్ లో మీరు మంత్రులుగా ఉన్నారు? అని ప్రశ్నించారు. 2009లో యూటర్న్ తీసుకోవడం వల్లే యువకులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేసిన పార్టీ బీజేపీనేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.